దారినా పోవు దరిద్రం ను నెత్తిన పెట్టుకోవడం లో నన్ను మించిన గనుడు లేడు...
అందుకే అన్ని సమస్యలు...
ఆ సమస్యలను తలగడగా మార్చుకొని నిదురపోవడానికి ప్రయత్నిస్తున్న...
ఎందుకంటే రేపు ప్రొద్దున నిద్ర లేవగానే మెడలో వాలేవి అవే కదా.
ఇదే నా దినచర్య.
శివ నీ దయ.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment