Thursday, July 31, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నా దారిలో ప్రతి అడుగు నీ వైపే...
నా మాట లోని ప్రతి అక్షరము నీ మంత్రమే...
నా చూపు లోని ప్రతి దృశ్యం నీ వెలుగే...
నా మనసు లోని ప్రతి తలపు నీ స్మరణకే...
నా నవ్వు లోని ప్రతి దరహాసం నీ దర్శనమే...
నా ఊహ లోని ప్రతి ధ్యాస నీ ధ్యానమే...
నా ఊపిరి లోని ప్రతి శ్వాస నీ నామమే.

శివ నీ దయ.

ఓం నమో వేంకటేశాయ

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

మనిషి జీవితంలో కష్టాలు దేవుడు ఎన్ని తీర్చినా ఇంకా మిగిలేవుంటాయి చెరువులో నీళ్ల లాగ. కష్టాలు సుఖాలు ఒకటి వెంట ఒకటి వస్తాయి చెరువులోని అలలు లాగ. ప్రశాంతమైన జీవనంలో చిన్న రాయి వేసి అలజడి వచ్చి, తుదకు ఒడ్డుకు చేరి సేద తీసినట్లు.

ఓం నమో వేంకటేశాయ
ఓం నమో నారాయణ.

Wednesday, July 30, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!                                                                                     
అందరి ని ఆటాడించుట నీకు వేడుక         
నిను కొనియాడుట మాకు వేడుక...
అరుణాచల
కరుణాచలా
రమణాచల
రమణీయచలా
మహాదేవ శంభో శరణు.

Tuesday, July 29, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నీ దృష్టిలో నేనున్నాను
జీవితం చిన్నదే అయినా
నీ సన్నిధిలో నాకదే పెన్నిధి
క్షణమైనా నీ కోసమే నా నిరీక్షణ
దయ చూపించి నా తాత్కాలిక గృహం వదిలించు...
నీ సమీపంలో శాశ్వత గృహంలో
గృహ ప్రవేశానికి దారి చూపించు.

శివ నీ దయ.

Monday, July 28, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
ఆశల చిట్టాల్లో అంతులేని కోరికల పద్దులున్నందేకేమో మరి నా ఆలోచన
పురుడు పోసుకుని మనసు అరల్లో
నిరంతరం తిరుగాడుతోంది...
నీ నామ జపం ఎలా చేయను మిమ్ము ఎలా తలవను...
నీ నామ స్మరణ చేయకపోతే నా మనసు అలసి పోతుంది...
అందుకే నీ పాద పద్మాలు అనబడే బంగారు పంజరంలో మానస రాజహంస లాంటి నా మనసు అనే చిలకను...
నీ భక్తి అనే పంజరం లో బందీ ని చెయ్యి...
నాపై దయ ఉంచి నన్ను కనికరించి ఈ ఒక్క వరాన్ని అనుగ్రహించు.

శివ నీ దయ.

Sunday, July 27, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
పరిచయం అయ్యాక పలకరింపు లేకపోతే ఎలా శివ...
నా గూడునొదిలి నీ గుడులు చుట్టూ నిను వెదుకుతూ తిరుగుతూనే ఉన్నాను...
నోరారా శివ శివా అని
ఆరాటంతో చూస్తున్నాను...
ఇక చాలు శివా నా గుండె గూటిలో
నుండే నాతో మాట్లాడు మౌనంగా.

శివ నీ దయ.
ఓం శ్రీ కాళహస్తీశ్వరయా నమః.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
పశువును నేను..
పశుపతివి నువ్వు...
నేను ఎక్కడెక్కడో తిరిగి మెదడు లో పనికిరాని చెత్తతో వచ్చాను తండ్రి
నీన్ను చూడగానే నాకు ఒక అలౌకిక మైన భావనకు గురి అయను నామనస్సు నీదై నీపాదల వద్ద ఉంచుతున్న తండ్రి...
దయ అనే తాడు వేసి..
శివ జ్ఞనము అనే దారి న నడిపించు...
నన్ను కరుణించు..

శివ నీ దయ.

Thursday, July 24, 2025

Wednesday, July 23, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
ఎవరో చెప్పారు 
క్షణమైనా మరువక 
నిన్నే తలిస్తే 
నిన్నే కొలిస్తే 
నిన్నే పిలిస్తే 
నీలా మారతారు అని 
ఆ జ్ఞానము నాకు 
ఇంకనూ అబ్బలేదు 
నీలా రూపం మార్చుకున్నాను 
క్షణమైనా మరువక నిన్నే తలచే జ్ఞానాన్ని ప్రసాదించు.

శివ నీ దయ.

Tuesday, July 22, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా;

నువ్వు పోసిన ప్రాణం నిన్ను ప్రాణంగా పూజిస్తుంటే పలకవేమి శివ...
బండరాయి కాదు పలుకు రాయి అని పలుకు పలికి నా జన్మ ను ధన్యం చేయవేమి హర...
నా అడుగు తడబడకుండా నా పయనం నా గమ్యం నీ వైపు పడేలా ఆజ్ఞాపించావేమి...
నాజీవిత లోలక కంపన పరిమితిని స్థిరపరచి నా ఊపిరి ఊయలలో నీ నామం స్మరించేలా దీవించు తండ్రి.

శివ నీ దయ.

Friday, July 18, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

మరిగి మరిగి ఇగిరి పోయే జీవితాలు మావి...
మరల మరల బ్రతకలేని బ్రతుకులు మావి...
మరకలతో మరలాకదిలే కాళ్ళుచేతులు మావి...
మా మోర వినిపిస్తున్నాము రక్షించు ఘనుడవు నీవెనయ్య.

ఓం నమో వేంకటేశాయ.
ఓం నమః శివాయ.

అమ్మ

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అమ్మ నీ పాదాలు ముక్తికి సోపానాలు...
అమ్మ నీ నామ స్మరణ సర్వ పాప హరణం...
అమ్మ నీ దర్శనం జన్మ జన్మల పుణ్య ఫలం...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నీకెన్ని పేరులున్నా నాకు తెలిసిన నామం ఒకటే ఓం నమః శివాయ 
అందుకే నా తలరాత ఎలా ఉన్నా నీ హృదయంలో చోటు కల్పించు...
శాశ్వతమనుకునే ఈభవ బంధాల మాయ నుంచి నన్ను తొలగించు...
ఆట రాని వాడిని పరమపద సోపానంలో నన్ను గెలిపించు.

శివ నీ దయ.

Tuesday, July 15, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అదేమి లీలో మరి!
నా మాట మౌనంగా ఉన్నా...
మనసు మాత్రం ఊరూరా తిరుగుతూ నిలకడ
లేక విలవిలలాడుతుంది...
నా మనసు తెలిసిన మహదేవుడివి నీవు.
నీ ఈ పాదాలు పట్టుకోవాలని వచ్చాను.

మహాదేవా శంభో శరణు.

Monday, July 14, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

పరబ్రహ్మస్వరూపిణి...
నారాయణి...
శివాని...
అనంతకోటి జీవరాశులలో తేజోమయిగా విలసిల్లే మూలప్రకృతి స్వరూపిణి.
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీ మాత్రే నమః.

Saturday, July 12, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నా ఆత్మ దర్శకుడు నీవే...
ఓం నమః శివాయ నామం తప్ప
మరేమి తెలియని నాకు ఆత్మదర్శన యోగం కలుగచేయగల ఘనుడవు నీవే యని నిన్ను నమ్మియున్నాను.... 
నామరూపములు కలిగిన నేను
 నామరూపములు లేని మీతో  గడపడమే నాకు ఆనందం.

శివ నీ దయ.

Friday, July 11, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
దర్శనమో నీ దరికి చేరుకోవడమో
నీ దయ ఎలా ఉందో తెలియదు...
ఏ సాధన లేని సామాన్యుడను...
నిను చూడాలని
గుడులు గోపురాలు దర్శించి తరించినా
నీ దరికి చేరే దారి కానక మనసులో
మౌనంగా ధ్యానం చేసుకుంటూ
సోహం ను శివోహం గా మార్చి
నడుస్తున్నాను...
ఏ భాగ్యం నాకు కలిగింతువో మరి...

శివ నీ దయ.

Thursday, July 10, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

గురుచరణం భవితవెలుగు సన్మార్గం చూపుతుంది ...
కల్మషాలు ఒక్కోటిగ తొలగించి మంచుకడుగు ముత్యంలా మార్చుతుంది...
గురుచరణం అజ్ఞానపు తిమిరాలను తరుముతుంది ,తప్పటడుగులను దిద్దుతుంది...
గురుచరణం మానవత్వ పరిమళాలు అద్దుతుంది.

ఓం శివాయ గురవే నమః.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
నా వాళ్ళు దారి తప్పిన వేళ
నీ వైపు లాక్కొని నీ ముంగిట
నిలబెట్టుకో పరమేశ్వరా...
అమ్మ కర్మ ఫలంగా సాగుతున్నా ఈ జీవితానికి సాక్షిగా నీవు నిలబడకు తల్లి...
కరిగిపోతున్న నా జీవితం అవకాశానికి కర్త కర్మ క్రియ లా ఉండు.

శివ నీ దయ.

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.

Wednesday, July 9, 2025

Monday, July 7, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
సమస్తము ఇవ్వగల మీ అభయ హస్తం పైన ఉండి... 
మీ దయా భిక్షకై వేచి ఉన్న ఈ దాసుని చేతులు కింద ఉండిన సంపద కన్నా మించిన ధనము మరొకటి కలదా తండ్రి...
నీ హస్తమే మాకు అభయ హస్తం
మము ఆపదలనుండి ఆదుకునే ఆపన్న హస్తం...
ఏమి సంపాదించావని అడిగిన ఈ లోకానికి ఏమని చెప్పేది...
మీ భక్తి ప్రపంచం ఒకడిని...

శివ నీ దయ.

Sunday, July 6, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
సాధ్యాసాధ్యాలకు కారణాలెన్ని ఐనా
సుఖదుఃఖాలకు చేరువగా ఉన్న...
పరమాత్మ (శివ) నీ లీలావినోదమే నా జీవితం.
నిలబడడం తెలియకనే పడిపోవడం అలవాటైంది
చేయూత కోసం నీకు చేతులెత్తి మొక్కుతున్న సామీ.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
జన్మ జన్మలనెడి చట్రమందున తిరుగ
జేతు వేల నన్ను...
నిన్ను జేరు దారి నెందుకు చూపవెందుకో...
మనసు ఆశ యందు చిక్కి ద్రోహ బుద్ధి విడవక దుఃఖమున మునిగే.

శివ నీ దయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...