Monday, August 18, 2025

శివోహం

శివా !
నువ్వు రచించే మాయలోని నీకిష్టమైన పాత్రలం మేము...
నువ్వు వచించే  మాటల్లోని అందమైన భావాలం...
నువ్వు దీవించే కాంతులలోని చైతన్య కిరణాలం...
నువ్వు ఒకడివి ఉన్నావని తెలిసినా తెలియదన్నట్టు తిరిగే అజ్ఞానులం...
మేమెలా ఉన్నా నువ్వు మాత్రం అలాగే ఉంటావు
మాలో మాకే అర్థం కాని నువ్వు లా...

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...