https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా !
అఖిల లోకములకు మూలం నీవే...
సకల శాస్త్రముల సారమూ నీవే...
అష్ట ఐశ్వర్యములకు అధిష్టానం నీవే...
దేవతా సార్వభౌమా...
సర్వ శక్తి సంపన్నుడవు నీవు...
నను కరుణించుట భారమా తండ్రీ...
నీ దయకు నేను తగని వాడినా.
సర్వలోకాలకు లయకారకుడైన సదాశివా తెలిసితెలియక మేము చేసిన తప్పులను క్షమించు.
నా చేతులతో కానీ,
కాళ్ళతో కానీ
కళ్ళతో కానీ,
చెవులతో కానీ,
మనసుతో కాని,
మాటతో కానీ,
తెలిసీ తెలియక చేసిన తప్పులకు నిన్ను నేను మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను.
నన్ను క్షమించు తండ్రి.
No comments:
Post a Comment