Sunday, June 21, 2020

ఓం

వార్ధక్యం  వరం
తెలుసుకుంటే
తెలిసి మసలుకుంటే...

అలుపెరుగని
నీ పయనంలో
ముచ్చటైన మజలీ

వేలు పెట్టి
కెలుకుట మాని
వేచి చూడు విశ్రాంతిగా

నిర్వేదం
నిరోదించు అదే
నీకు అమృతమందు



వచ్చినదేది
ఉండిపోదు
నువ్వేమనుకున్నా


నచ్చినదేది
నిలిచిపొదు
అది నీదనుకున్నా

బ్రతుకన్నది
తెలియని బాట
తరతరాల తెలిసిన మాట

కాలం ....నీకు
కనిపించని ప్రవాహం
గమ్యాన్ని చేర్చుట ఖాయం

వార్ధక్యం 
విరియాలి
నీకు నీవు తెలియాలి

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...