శివా!ఒకే ఒక సంకల్పంతో సృష్టించిన జగతిలో
వికల్పాలు ఎన్నెన్నో విరిసిన నీ మాయలో
వేడుకగా చూస్తున్నావు వేరుకాని నీవు
మహేశా . . . . . శరణు .
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment