Sunday, June 21, 2020

నాన్న

నడిచే దైవం నాన్నా
నడిపించే దైవం నాన్న

తన చేతితో లోకం చూపి
తన చేవతొ నన్నుగ నిలిపి
నా గుండెను భాసించేను
నా గమ్యం ఎరిగించేను

పాలించే పరమాత్ముని తేజం
శాసించును ఉద్ధతి కోసం
అనురాగం దాల్చిన రూపం
ఆ రూపమె రక్షణ కవచం

పది జన్మల పుణ్యం నాన్న
పదగామిగ నిలుచును నాన్న
నిన్నటి కొడుకే రేపటి నాన్న
రేపటి నాన్న మరి కావగ మిన్న

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...