Tuesday, December 30, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ఏ జన్మ బంధంమో ఈ జన్మలో నీకు బందీ ఐపోయా...
నీ నిజభక్త బంధువులంతా నాకూ బంధువులే...
నీవె నాకు ఆత్మబంధువు...
అందుకే నాతో నేనే మాట్లాడుకుంటున్నాను
నాలో ఉన్న నీవు వింటావని...
చుట్టూ ఉన్న పంచభూతాలు వింటాయని...
ప్రకృతి మాత గమనిస్తుందని...
నిన్ను చూస్తూనే నిన్నే తలుచుకుంటూ
నాతో నేనే మాట్లాడుకుంటున్నాను.

శివ నీ దయ.

శివోహం


హరిహర పుత్ర అయ్యప్ప!
నా మనస్సు నీకు ఒక అద్భుతమైన సేవకుడు…
నాకు ఒక ప్రమాదకరమైన యజమాని కూడా.
నీపై ఎంత భక్తి ఉందో అంతే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో నిండి ఉంది.
శివుడి అగ్ని లేనిది చీమైన కుట్టదు అంటారు కదా.
తెలిసి తెలియక చేసిన తప్పులకు నీవె శరణు నీదే రక్ష.

మణికంఠ శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

కలియుగంలో నామ స్మరణను మించిన మార్గము లేదు ఈశ్వరుని అనుగ్రహానికి
ఈశ్వరుని నామము గుణ గణములు స్మరించటం తెలపటం చదివించటం ఎంత పుణ్య కార్యమో అవి చదివిన వారు ఈశ్వరుని గుణ గుణములను మనసులో స్మరణ చేయటం, వ్యక్తీకరించటం కూడా పుణ్య ఫల ప్రదము ఈశ్వరుని గుణ గణములను మదిని నిలపండి తలవండి కొలవండి వ్యక్త పరచండి ఎల్ల వేళలా...

సర్వం ఈశ్వరార్పణమస్తు

Sunday, December 28, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఎన్ని కష్టాలు కలిగిన
ఎంత దుఃఖము అనుభవించిన
ఎన్నెన్ని ఓటములు ఎదురైన
పట్టిన మీ పాదం విడువను కాకా విడువను...
ఈ దినమే కాదు నా ప్రతి దినం మీ సేవలో తరించడం కోసమే...

శివ నీ దయ.

Saturday, December 27, 2025

శివోహం



శివ! 
నేనో పశువుని...
నీవు పశుపతివి...
ఇంతకంటే ఏం కావాలి సంబంధం...
నాపై నీవు దయ చూపించటానికి...
తపస్సు పండించి...
నిరీక్షణ ఫలించగా...
జన్మ సార్ధకత చెందునట్లు ఒక్కమారు కదలిరావా తండ్రి.

మహాదేవా శంభో శరణు.

Saturday, December 13, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీవు ఏదైనా ఎంతైనా తాగగలవు...
నీవు అనంతుడవు, అమేయుడవు...
నేను అల్పుడను...
నీవు గొంతున బిగపెట్టగలవు అమ్మ రక్షగా...
నేను నా బాధలు మింగనూ లేను, గ్రక్క లేను అందుకేనేమో ఈ వికారాలు, చికాకులు...
నీ అంతటి వాడిని కావలెనన్న నేనీలో చేరాలి సాధ్యమా తండ్రి...
నాలో నా "నేను" మెదిలే వరకూ.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఆదిదంపతులకు వందనం...
దుఃఖము పై దుందుభి వాయిస్తూ…
ఆనంద మనే ఆయుధం ఇస్తూ…
పిల్లలు కు రక్షకుడివై ఉన్నావు…
నీ ఈ చిన్ని పిల్లలకు…
సంరక్షకుడివై ఉన్నావు.

ఓం నమో పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర.

Tuesday, December 9, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అన్ని జీవరాశులు నీ ఆధీనంలో ఉంటాయి కదా...
మరి *నేను* ఎందుకు వీధి వీధినా తిరుగుతున్నాను?...
నా *నేను* లో నిన్ను చూసేదెప్పుడు?...

శివ నీ దయ.

Sunday, December 7, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
సదా నీసేవలో తరింపజేసే భారము బాధ్యతా నీదే తండ్రీ...
పంచభూతాత్మకము ,పంచేంద్రియ ప్రకోపితము ,అరిషడ్వర్గాల ప్రభావితము ,పూర్వజన్మల కర్మల వేదితము అవుతున్న ఈ తనువు మనసులను నీ అదీనము చేయుట నా తరం కావడం లేదు...
నన్ను నీవాడిగా భావించి ,నాకు ఏది యుక్తమో, ఏది సవ్యమో ,భావ్యమో ,ఆ విధంగా నన్ను తీర్చి దిద్దుకో.

శివ నీ దయ.

శివోహం

ఈ తనువు వదిలి శిదిలమైనప్పుడు 
నిన్ను తలచి , కొలిచి, పిలిచే శక్తి ఉండదని..
నిత్యం నీ నామ స్మరణం లో ఉండేలా చేశావు..
ఎన్ని జన్మల తపమో...
ఎన్నిజన్మల పుణ్య పలమో...

శివ నీ దయ.

Monday, December 1, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నిజమైన ఙ్ఞానం ఏమి తెలియని వారికే ఎరుకలోకి వస్తుంది అంట హర...
ఏదుందో అది
ఎట్లుందో అట్లా
అంతా నీ చెంత నే 
యేమీ చెప్పలేను
యేమీ అడగలేను
యేమీ కోరలేను.

శివ నీ దయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...