Saturday, November 8, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నింగిలో సగం 
నెలలో సగం 
కష్టంలో భాగం సుఖంలో భాగస్వామ్యం...
ప్రకృతి లేని విశ్వమెక్కడ 
స్త్రీలేని బాంధవ్యమెక్కడ 
సంసారసాగరంలో తెరచాప నావ 
తెరచాపలేని నావ దిక్కులేనట్లే 
నావ లేని తెరచాపకు పరమార్థమేది
రెండు తోడయితేనే నావ తీరంచేరు
అదే ఆలుమొగల తత్వం 
అర్ధనారీశ్వరం.

ఓం అర్ధనారీశ్వరయా నమః.
సదాశివుడే సదా నాకు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

అత్యాశ అంటారేమో...
కానే కాదు...
ప్రయత్నం చేద్దాం.
ఈరోజు కాకపోతే రేపు...
రేపు కాకపోతే ఎల్లుండి లేదా ఆ మరుసటి రోజు...
ఈజన్మ కాకపోతే వచ్చేజన్మ... వచ్చేజన్మ కాకపోతే ఆ మరుజన్మ లేదా ఆ పైజన్మ...
ఏదో ఒకరోజునా...
ఏదో ఒక జన్మనా...
మన ప్రయత్నముకు ఫలితం రాక తప్పదు...
ఇదే కర్మ సిద్ధాంతం.
అందుకే దైవాన్ని భక్తిగా నిత్యం ప్రార్ధిద్దాం.

ఓం నమః శివాయ.

Friday, November 7, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సదాశివ!
ఒకే ఒక కోరిక తండ్రి...
మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ...
మీరు ఇచ్చిన ఈ తనువు రోగగ్రస్తమై మంచాన పడి యాతనపడుతూ ఇతరులకు భారంగా మారేక వచ్చే మరణం మాత్రం వద్దు...
ఎవరి మీదా ఆధారపడకుండా, జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని నాకు ప్రసాదించు...
మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు తండ్రి.

శివ నీ దయ.
సదాశివుడే సదా నాకు.

అమ్మ దుర్గమ్మ

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

బిడ్డ ఆకలి తల్లికి కనిపించదు...
మనసుకు తెలుస్తుంది...
అమ్మ ను తలుచుకుంటే చాలు భాదను తెలుసుకొని ఆదుకుంటుంది...
అమ్మ ను వేడుకుంటే మనసు  ప్రశాంత మవుతుంది.
అమ్మ దయ ఉంటే చాలు అన్ని ఉన్నట్టే కదా.

ఓం శ్రీమత్రే నమః
ఓం దుర్గాదేవినే నమః

Sunday, November 2, 2025

శివోహం

హరిహర పుత్ర అయ్యప్ప...

ఇతరులకు ఎంతో కష్టతరమైన విషయాలు...

నాకు మాత్రం తేలిక చేసేసి, ఒక్క పని మాత్రం గీత గీసి మిమ్ము చూడకుండా ఆపుట తగునా?.

మణికంఠ శరణు.

Saturday, October 25, 2025

గోవింద

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

కష్టం వచ్చి కింద పడ్డా కూడా
బంతి లా పైకి లేపే శక్తి క్రిష్ణ నీ తోడుంటే
అంతకన్నా అదృష్టం కావాలా
అంతకన్నా అమృతం కావాలా హరి.

ఓం శ్రీకృష్ణా పరమాత్మనే నమః
ఓం నమో వేంకటేశాయ 
ఓం నమో నారాయణ

శివోహం

శివ!
అందనంత ఎత్తులో నీవుంటే...
అధః పాతాళమున నేనున్నాను, ఎట్లాగయ్యా మిమ్ము చేరేది?.

శివ నీ దయ

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...