ఉన్నాడు ఒకడున్నాడు
ఈ సర్వం జగత్ వ్యాపించి శివుడు ఒకడున్నాడు.
శివుణ్ణి చూడాలంటే ఎన్నో సుడిగుండాలు దాటాలో మరి.
శివుడు అనుగ్రహిస్తే ఏదో ఒక దేహం తో దర్శనమిస్తాడు.
ఓం శివోహం... సర్వం శివమయం.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...