రూపాయి ముడుపు కట్టి లక్షలు కోరేవాణ్ణి కాదు
ఒకే ఒక కోరిక తండ్రి తెలిసీ తెలియక తప్పులెన్ని చేసినా
నన్ను అక్కున జేర్చుకో నీ చెంత నిలుపుకో.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment