Wednesday, November 30, 2022

శివోహం

కామక్రోధమదమాత్సర్యాలు వెంటాడు తున్నాయయ్యా  
నిన్నే శరణ మంటూ పార్ధిస్తున్నామయ్యా...
అజ్ఞానంకు తోడు భయమేదో కలుగుతుందయ్య...
నా భయాలన్నీ తొలగించి ధైర్యం చెప్పవయ్యా...
పాపాలు పొలంలో మృగాల్లా నాలో చేరి
పుణ్యమనే పంట నాశనం చేసి చేస్తున్నదయ్య యజమాని నీవై తరిమిగొట్టాలయ్య...

మహాదేవా శంభో శరణు.

Tuesday, November 29, 2022

శివోహం

ఈ జీవితం అంతులేనిదీ అంతుతేల్చలేనిది...
ఉదయ సంధ్య ఎడారులలో సాగిపోతుంటది...
ఎండమావి ఆశల వెంట పరుగుబెట్టిస్తది...
నల్లేరు ఎడారులలో తింపుతూనె ఉంటది....
జరిగేదంత నీ మాయ అనే తెలుసు స్వామి నీవు ఆడే ఆటలో అడలేకున్నాం...

హరిహారపుత్ర అయ్యప్ప శరణం.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం


శివ...
నా మరణం ఏ భావాన్ని గ్రహించినదో ఏ తత్త్వాన్ని తలచినదో ఏ రూపాన్ని ఊహించినదో ఏ నాదాన్ని స్వరించినదో కానీ...
శాశ్వతమై శూన్యమై ఉదయంలా ఉద్భవించాలని ఉంది...

మహదేవా శంభో శరణు.

శివోహం

చేతికి సంకెళ్లు వేసీ...
పాప పుణ్యాలు చేయిస్తుంటావు 
మనస్సుకు శాంతి కల్పించకా...
మమ్ము ఆడిస్తూ ఉంటావు...
చలి కల్పించీ, సుఖం ఇచ్చేటి వేడితో కల్వ మంటావు...
సంసార పోషణకూ సంపద కొరకూ తిప్పు తుంటావు...
భోగవిరాగముల చుట్టూ తిప్పి సంతోష పడతావు...
ఒక్కరి కష్టంతో, కొందరి ప్రాణాల్ని రక్షించ మంటావు...
మంచో చెడో, తెల్సుకునే శక్తి ఇవ్వక మాయ చేస్తావు...
ఇష్టాల్ని కష్టాలుగా కష్టాల్ని ఇష్టాలుగా మారుస్తావు...
ఐనా నీవేగతి మాకు వేరు దారి లేదు...

మహాదేవా శంభో శరణు.

Monday, November 28, 2022

శివోహం

నమస్తే నమస్తే మహాశక్తి పాణే
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే 
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే 
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే

హరోం హర హరోం హర.

శివోహం

ఊపిరిని ఇచ్చే నీవు నాలో ఉన్నత వరకు నీ రూపం నా హృదయమున నిలవని...
నీ కథాశ్రవణం కార్ణాలలో రవళించని...
నీ నామం స్వరనా మారుమ్రోగనీ...
నీ ధ్యానం నా మదిలో నిండిపోని...
సదా నీ చరణవిందములు చెంత నా జీవితం ఇలానే వెలగని...
హరిహారపుత్ర అయ్యప్ప శరణు.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

సమస్త బంధాలు సముద్రములో సుడిగుండాలు 
కాల చక్రంలో తిరిగి కలిసే పేగుబంధాలు...
అర్ధంలో అర్ధము పరమాత్మ చూపే ఆత్మ బంధం  
శివుడిని జీవుడికి మధ్య తలపుల బంధమే అసలైన బంధం...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...