ఈ జీవితం అంతులేనిదీ అంతుతేల్చలేనిది...
ఉదయ సంధ్య ఎడారులలో సాగిపోతుంటది...
ఎండమావి ఆశల వెంట పరుగుబెట్టిస్తది...
నల్లేరు ఎడారులలో తింపుతూనె ఉంటది....
జరిగేదంత నీ మాయ అనే తెలుసు స్వామి నీవు ఆడే ఆటలో అడలేకున్నాం...
హరిహారపుత్ర అయ్యప్ప శరణం.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment