Thursday, October 9, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఇంతకాలం నా మనస్సు నిన్ను విడిచి ఇంద్రియాలకు వశుడై ఒక పశువువలే తిరిగింది...
ఈ నా మనస్సు కొద్ది సమయం నా మాట విన్నట్టు గా వుంటుంది. మరలా కొద్ది సేపు నీ నుండి వెళ్లి గతజన్మ లనుండి తనకు ఆలంబనగా పట్టుకువచ్చిన వాసనలను పట్టుకుంటోంది శంకరా...
ఈ మనస్సు అనే పశువు కి యజమాని నీవే కదా...
ఆ పశువును పలుపు తాటితో కట్టి 
నీ పదమునుంచలేవా.?
ఆ వరము నీయలేవా.?

శివ నీ దయ.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...