Thursday, October 23, 2025

శివోహం

*శివా నీ లీలా వినోద*
*సన్నివేశాలలో ప్రపంచం*
*మూలమూలాల్లోకీ సాగిపోతూ*
*శూన్యాకాశాల్లో తెగిన*
*గాలిపటాలైన జీవాలకి*
*రోగాలు శపించీ*
*శరీరాలు శుష్కించీ*
*దిక్కులు చివర చూపులుగా మలచి*
*మృత్యువు చీకటిలోకంలోకి*
*మెల్లిమెల్లిగా జారిపోయే వాళ్లకీ*
*జీవితాశ కల్పిస్తావు*
*సుతిమెత్తని చేత్తో ప్రాణానికిలేపనం చేస్తావు*
*దీనదేహాల్ని అందరూ అసహ్యించుకునే చోట*
*అంతరంగాలు రాళ్లై ఘనీభవించిన చోట*
*ఆర్థ్రపరిమళాలు చల్లి ఆదరిస్తావు*
*ఇవ్వటంలోని ఆనందాన్ని బోధపరుస్తావు*

*శ్రీశైల మల్లికార్జున శివ నీ దయ.*

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...