Thursday, September 25, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం...
ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాసుడు....
అందర్నీఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు నీవు...
రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించావు...
భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చావు...
దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడవు నీవు ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు....
నా మాట చెవిని పెట్టు నీ ఆట కాస్త విడిచి పెట్టు నన్ను ఉద్ధరించ దృష్టి పెట్టు.

శివ నీ దయ.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...