శివా!
గుండెలోన పొంగుతోంది హాలాహలం...
మీ లాగా మింగలేక
బాధను దిగమింగలేక
ఏమిచేయ పాలుపోక
మునుపటిలా ఉండలేక
మనసంతా మలినమై
ఉచ్చ్వాసే అనలమై
మిగిలినాను జడుడిలా
మహాదుఃఖ కడలిలా.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment