శివా నీ నామస్మరణతో నాకు నిదుర రాదు.
నీకు నాతో ఆడే సరదా తీరదు
శివా నీ దయ
శివా!సౌఖ్యములడగను నేనెపుడూ
పరసౌఖ్యము కోరను నిన్నెపుడూ
నీ పదముల నుంచుము నన్నెపుడూ
మహేశా . . . . . శరణు .
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment