శివా!
అద్దె ఇల్లు నాకు ఇరుకు గా ఉంది...
బాధలు బందలతో గుండె గదుల్లో చోటే లేదు...
ఐనా నీ ఇల్లు విడిచి...
ఈ ఇరుకు గుండెలోన ఇమిడి ఉన్నావేమయ్యా...
ఇరుకు గుండెలోన ఇమిడి ఉన్నావు..
మా బోటి వారితో ఈ బంధం ఏలనయ్యా హర.
మహాదేవా శంభో శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment