https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
కలియుగం కలుషాలకు నిలయం, దినదినం నా ఆలోచనల లయలు మారుతూ...
అలలు కడలి తీరంపైనే
నిలబడి పోతున్నాయి...
మాయ నీ లయలో చేరేవరకు నేను
చాలా లోయల వనాల తిరగాలి కదా అందుకే చలనము లేని మదిని అందించు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment