శివ!
నీకు తెలుసు నాడు నేను నీ దాసుడిని అని...
ఇప్పుడేమో క్రోధారాజు కొలువులో పడి నేడు దాసుడైతి...
నీ దాసుడు మరొకరికి దాసుడు అవ్వడం నీకు న్యాయమేనా
నీ మౌనం తో నా హృదయం నిశ్శబ్దం నీరయ్యింది..
ఓసారిటొచ్చి నా కళ్ళను తుడిచిపోవూ.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment