శివ!
నీవు శ్రీమంతుడివి..
నా కోరికల చిట్టా నీదగ్గర కాకుండా ఇంకెవరి దగ్గరవిప్పను.
జ్ఞాపకాల వీధుల్లో తిరుగుతూ ఒంటరిపోరాటం చేస్తుంది మది..
వెలుతురై దారి చూపి నా మనసు ఎక్కడుంటే నీ పాదం అక్కడుంచు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment