శివ!
జయ విజయులను తప్పించుకొని నిన్ను చేరాలనుకుంటున్నాను
నిన్నూ, అమ్మని, ప్రార్ధించి, మీ పాదాల చెంత ఉండాలనుకుంటున్నాను...
కళ్ళు మూసిన, కళ్ళు తెరిచినా, నీ రూపాన్ని తలుస్తూ ఉన్నాను...
నా తండ్రివి నీవు, నా రక్షకుడవు నీవే శివ.
మహాదేవా శంభో శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment