Saturday, March 9, 2024

శివోహం

చీకటి బతుకులే కానీ నిస్వార్థం, నిర్మలత్వం ఉన్న జీవితం...
కుళ్లు, కుతంత్రాలు లేని జీవనాలు..
చిల్లర బతుకులే సబ్బుబిళ్లను సగం ముక్క చేసి వాడుకుంటూ..
చిల్లులు పడిన పరుసులోనే చిల్లర పైసలు దాచుకుంటూ..
ఆకలి బతుకులే...
ఉన్న రోజు పరమాన్నం వండుకొని తింటూ..
లేని రోజు పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటూ..
మధ్యతరగతి బతుకులే...
చాలీ చాలని సంపాదనతో సంసారాన్ని నెట్టుకొస్తూ..
కష్టనష్టాలను, భాధ్యతల బరువుల్ని కూడా చిరునవ్వుతో మోస్తూ.
శివ నీ దయ.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...