నాకంటూ ప్రశాంతత ఎప్పుడొస్తుందో...
నేను హాయిగా ఎప్పుడు నిద్దరోతానో...
నాదంటూ ఒకరోజు ఏనాడొచ్చేనో...
అంతవరకూ నా చేతుల్లో లేదేదీ...
కానీ నాకు తెలుసు ఆ రోజు దగ్గరలోనే ఉంది...
శివ నీవు ఉన్నావు...
నాకు తోడై...
నావెంటే నీడై...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment