Friday, March 1, 2024

శివోహం

మౌనంగా కనులు మూసుకొని
మనసులో నీ రూపు నిలుపుకొని
ఆర్ధతా భావంతో, పలకరించే వేళ
కనులు తడిబారినా అదుపుచేసుకోగలను...
కానీ గుండె గదుల్లో నీవు కనిపించి మాయమైతే తట్టుకోలేను..
నా ఆవేదన దక్షిణ నీవు తీసుకుని నాలో ఉండమని కోరుకుంటున్నాను...
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...