శివా!నిశ్శబ్దాన్ని చీల్చుకు వచ్చిన శబ్దమే
నన్ను నిశ్శబ్దానికి నడిపించే శబ్దం కావాలి
నాలో ఆ శబ్దం ఆ శబ్దంలో నేను కలిసిపోవాలి
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment