Wednesday, February 28, 2024

శివోహం

దారి తప్పిన నా మనస్సు తెలిసి తెలియక చేసిన పాపాలు ఎన్నో...
గాడి తప్పిన మతిని అనుసరించి మనిషిగా చేసిన నేరాలు ఎన్నో...
అన్ని దోషాల మూటలే...
మోయలేని ఈ భారాలను నా తల ఎంత కాలం మోస్తుంది...
భారాలను బాధలను దించి హరించే వాడివి నీవు
నా బ్రతుకులు మార్చే వాడివి నీవు.
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...