స్వార్ధము వీడి నిస్వార్ధమును ఎరిగి
నిజమగు సేవ నిక్కచ్చిమై వెలుగు
నీ పాద సేవ నిరతము భక్తితో కొలవ
నిలుచు నిరతము సదా మదిలోన స్వచ్ఛముగా
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment