Sunday, November 5, 2023

శివోహం

శివనామస్మరణ తలపులలో నిలిచి గూడుకట్టుకున్నవి...
నీనామ జపంలో సర్వం మరచి మనసులో మైమరచి ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందుతున్న వేళ మౌనం సామ్రాజ్యం ఏలుతూ స్మరణ మనన ధ్యాన ధ్యాసలు నలుదిశలుగా భావించే భాగ్యం 
కలిగించవా....
నీరూపం చూడగానే నా మనసు నీవలే ఘడియైనా నిలిచేలా దీవించు తండ్రీ.

ఓంమహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...