శివా ! రేపటి నీ ఆశలకై ఎదురు చూస్తూ
నిన్నటి నీ అనుభవాల జ్ఞాపకాల దొంతరలో
నా కన్నీటి సంద్రం లో ఒక కన్నీటి పొర నీకోసం మిగిలే ఉంది
నీవు కనపడితే పాదాలు కడగడానికి
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment