Monday, July 24, 2023

శివోహం

ఈ జన్మ ఇచ్చింది...
బంధాలు కల్పించింది... సంపదలు అనుగ్రహించింది...
తద్వారా ఆనందాలు నింపింది నీవేనని తెలుసు తండ్రి...
ఈ ఉరుకుల పరుగుల జీవితం లో నీ సన్నిధి కి రాక...
నీ  సేవకు నోచుకోక మనసంతా భారమయే...
కనీసం నిరంతరం నీ ధ్యాన గాన తత్పరతో ధన్యుణ్ణి చెయ్యి...
తండ్రి గా అది నీ బాధ్యత...
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...