శివ...
సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ
నిన్ను మరిచిపోతున్నాం...
అహంకార మమకారాలు అనే ఇనుప గొలుసులతో కృత్రిమ అనందం అనే ముసుగులో అజ్ఞానంతో మాకు మేమే బందీలమై నీ గురించిన ధ్యాస లేకుండా నిన్నువిడచి మరచి బ్రతుకుతున్నా నన్ను క్షమించు...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment