పసిడి వయసులో నీ గుడి అరుగులమీద
గడిపిన నాజీవనయాత్రను నీ గుడి
అరుగులపై ఒదిగే
భాగ్యాన్ని కలిగించు
బ్రతుకుపోరాటంలో నిన్ను మరచిపోకుండా
గొడుగువై నీడవై నన్ను కాపాడు శివా...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment