Wednesday, June 14, 2023

శివోహం

శివ...
నిన్నొక్క సారి చూడాలని ఉందయ్య...
నా గుండె లోని బాధ నీకు చెప్పాలని ఉంది !
ఎక్కడవుంటావు నీవు ?...
ఎలా నిన్ను తెలిసేది ?...
పట్టరాని నిన్ను ఎలా పట్టాలి...
భక్తితో డ నీ  కృపను  పొందాలని ఉంది తండ్రి...
నాలో నిను దర్శిస్తూ ఆనందించాలని ఉంది...
నీ కరుణామృత వర్షధారలో నే ఎలా తడిచి తరించేది?...
నీ చరణకమలాల ముందు నా హృదయాన్ని  ఎలా పరచేది...
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...