అనంత విశ్వమంతయు నీవు కదా తండ్రి...
గుళ్ళు గోపురాలు నీకెందుకయ్యా...
అసురుని పొట్టలోన ఉంటావంట కదా...
నా గుప్పెడు గుండెలోన ఉండిపోవా శివ...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment