శీల వైభవము చేత
శివ గుణగాన నైపుణ్యము చేత
శివ మాహాత్మ్యం తెలియుట చేత
శైవక్షేత్ర సందర్శనము చేత
శివభక్త సాంగత్యము చేత
"శివోహం" భావన చేత
జన్మధన్యము కావింపబడును.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment