శివా!ప్రవృత్తి మార్గానికై నన్ను పుడమికంపి
నివృత్తి మార్గాన నన్ను కూడమన్నావు
ఏ వృత్తి ఎంచుకోను నా తృప్తి పెంచుకోను .
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment