భూలోకంలో పాపపుణ్యాల భారాన్ని మోస్తున్న వాడవు నీవు...
కాలాన్ని నిరంతరం కదిలే ప్రవాహంలా సృష్టించిన వాడవు నీవు...
సుఖ దు:ఖాలతో జీవులు బ్రతకాలని సాక్షిగా నిలిచినా వాడవు...
ఆశ నిరాశల మద్య ఊగిసలాడుతున్నా మమ్మల్ని కూడా కాపాడి కరుణించు శ్రీ శ్రీనివాస...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment