Wednesday, August 17, 2022

శివోహం

వేగిరపడుతున్న ఈ మనసుని నువ్వు ఎప్పుడు ఆదరిస్తావు స్వామి...
నీ అడుగుల తివాచీలా ఉబలాటపడి పరిచిన  హృదయ సీమకి నువ్వు వచ్చేవనిబీఅంతా నీ అడుగుల  అచ్చులే ముద్రితమని తెలిసేరోజు కోసం ఈ జీవిత సమస్తంవేచిఉన్నది...
ధర్మానికి వేదిక నీ ముందర ఉండడమే నా ఆత్మకు కాంక్ష....
నేను అంతా నిరీక్షణగా మారి ఉన్నాను...
నీ ప్రతిక్ష పొందడమే పరమావధిగా
ఈ అనంత జలనిధి దాటెందుకు నీచేయూతలో
నాలోనుండి నాలోకి ప్రయాణించే గమనాన్ని వేగంగా మార్చు, మరెక్కడ ఆగకుండా నిన్ను చేరేందుకు ఉరవడి ఉండనీ గట్లు తెగిపోయి స్వామి...
ఓం శివోహం... సర్వం శివమయం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...