పునరపి జననం
పునరపి మరణం
రంగుల రాట్నం అనే జీవన చట్రం లో గుండ్రంగా తిరుగుతూనే ఉండాలా తండ్రి...
ఆట నీకు అలుపు లేదేమో కానీ నేను అలసి పోయా తండ్రి
మళ్ళీ మళ్ళీ ఏ తల్లి గర్భంలోకో పంపించక ....
నీ గుండెలోనే దాచుకో పరమేశ్వరా....
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment