జీతమిచ్చే యజమాని దగ్గర ఎంత భయ భక్తులతో ఉంటామో...
అలాగే గురువు దైవం దగ్గర కూడా ఉంటె బాగుపడతాము...
భయం నుండి దైవం పుట్టింది...
భక్తి నుండి దైవత్వం పుట్టింది...
భయం భక్తులను మించిన స్థితియే ముక్తి.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment