నానుదుట మూడు గీతలు గీసి పంపావు...
అందరూ నన్ను వీడిపోయినా...
నీతో అనుబంధం మరింత బలపడి..
నిత్యం నీనామస్మరణకు సావకాశం పెరుగుతుంది..
నీవు మాత్రం నన్ను వీడిపోబోకుమా శివ..
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment