ప్రదోష తాండవ శివుడు
ఆనంద నిలయుడు
నాట్య నాయకుడు
లాస్య లావణ్యుడు
భవసాగరం దాటించు భవుడు
భావనాతీతుడు భావరమ్య రమణీయుడు
శివ, శివా
హర, హరా
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment