జన్మజన్మ పాపాలు
నన్ను వెంటాడు చుండగా
శాపములా కోపం
నన్ను చుట్టు ముట్టు చుండగా
ధైర్యము అందించే నా మనస్సులో నీ ఉండగా
నీ నామ జపమే నాకు రక్షణగా ఉన్నది శివ...
మహాదేవా శంభో శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment