Wednesday, October 13, 2021

శివోహం

పదములు అల్లగా పండితుడను కాను...
కనులు అర్పించగా కన్నప్పను కాను...
గుడులు కట్టించడానికి రామదాసును కాదు...
పామరుడను శివ పామరుడను...
పెదవుల నీ నామ్మొక్కటే పలకగలను...
నిన్ను పిలుస్తూనే ఉంటా...
పలికితే పరమశివుడవు...
పలకకపోతే మహాదేవుడవు...
నేను మాత్రం నీ పాదం విడవను...

మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...