Saturday, October 30, 2021

శివోహం

 శివా!ఇక్కట్ల ఇల్లాయె ఈ దేహము
బాధించు చున్నాది భవరోగము
ఛేదించలేకున్నాను ఈ ఖేదము .
మహేశా . . . . . శరణు .


శివా!ఎడతెగని అలలు ఎదను ఆలోచనలు
అవి పుట్టి గిట్టిన వేళ నిన్ను చుట్టనీ
నా చుట్టలన్నీ వీడి అవి నిన్ను ముట్టనీ
మహేశా . . . . . శరణు .


 శివా! పదార్ధం నిన్ను చేరితే ప్రసాదం
ప్రసాదం నన్ను చేరితే నీ కటాక్షం
ప్రసాదం అందనీ  నీ కటాక్షం పొందనీ
మహేశా ..... శరణు

 శివా!సృష్టి చేయ కోరింది నీ సంకల్పం
నిన్ను చేర కోరింది నా సంకల్పం
నీ సంకల్పంతో సిద్ధించనీ నా సంకల్పం 
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...