సర్వ మంగళా సర్వార్ధ మెరిగి...
శరణ శరణన్న భక్తుల కరణ నేరిగి...
రోగములను బాపు అమృతమును అందించి...
సర్వ సిద్ధిలనొసగి ధర్మ మార్గముపు నడక చూపి... సత్యముగా, న్యాయముగా జీవితమును గడుపుటకు శక్తి నీయవయ్యా వినాయక...
పార్వతి పుత్ర శివ తనయ శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment