శివ...
నాలో జీవుడు నీవు ఆడుకునే బొమ్మ అనేనా
నా వెనక నుండి నన్ను పరుగెత్తించి
నీ ఒడిని చేర్చుకుంటూ
నేలను పడవేస్తున్నావు
ఎన్నాళ్ళు ఈ ఆటలు శివా
నీ బొమ్మ నీ దగ్గరే ఉంచుకో
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment