శంభో
అభిషేకం కోసం నేను ప్రత్యేకంగా సముద్రజలాన్ని కోరుకోకు తండ్రి...
అహం బ్రహ్మాస్మి అన్న భావనలో నా మనస్సనే సముద్రం నుండి పొంగి, కళ్ళ తీరాలు దాటి జాలువారుతు నీ కలశంలోనే పడుతున్నవి ఆ కన్నీటి చుక్కలతో అభిషేకించుకో
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment